అనంతపురం జిల్లా, ఉదంతం మండలంలోని గోనే హాళ్ గ్రామానికి చెందిన కాళిదాసురాజు అనే వ్యక్తి కొడుకుకు ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు. నీ కొడుకు చరణ్రాజ్కు సీటు కావాలంటే రూ. 20 లక్షలు ఫోన్ పే చేయాలని సూచించాడు. ఆయన మాటలు నమ్మిన రైతు విడతల వారీగా రూ. 19.24 లక్షలు ఫోన్ పే చేశాడు. సీటు కోసం రెండు రోజుల క్రితం ఫోన్ చేయగా అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో విషయాన్ని స్థానికులకు తెలుపగా మోసపోయావని వెంటనే పోలీసు లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. దీంతో గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.