అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండలంలోని విరుపాపల్లి వద్ద దారిదోపిడీకి పాల్పడిన ఒకరిని గురువారం రామసాగరం క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామకృ ష్ణయ్య తెలిపారు. గతనెల 23న గుంతకల్లుకు చెందిన అలీ అబ్బాస్, ఇర్ఫాన్ అనే ఇద్దరూ పోలీసులమంటూ శెట్టూరు మండలం మాలేపల్లికి చెందిన రైతు గోవిం దప్పను బెదిరించి రూ. 37,500 నగదును దోచుకెళ్లారు. రాబడిన సమాచారం మేరకు వీరిద్దరిలో ఒకరు అలీ అబ్బాస్‌ను సిబ్బంది, ఏఎస్ఐ రాందాసు, విజయ నాగభూషణ, శివశంకర్‌లతో కలిసి దాడులు నిర్వహించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. మరొక నిందితుడు ఇర్ఫాన్ పరారీలో ఉన్నారన్నారు. వీరి పై యాడికి, తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లల్లో రెండు కేసులు ఉన్నాయన్నారు. అలీ అబ్బాస్ నుంచి రూ. 15 వేలు నగదును రికవరీ చేయడం జరిగిందన్నారు