అనంతపురం జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. డి హీరేహాళ్ మండలంలో ఇద్దరు రైతులు మృతిచెందారు. రాయదుర్గం నుంచి బళ్లారి వైపు వెళ్లే మార్గంలో.. బాదనహాళ్ గ్రామం వద్ద బైక్‌పై వెళుతున్న కొల్లారప్ప(40), రమే్‌ష(50)ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మురడి గ్రామానికి చెందిన వీరు తోడల్లుళ్లు. తమ పొలాల్లో పత్తిసాగు చేసేందుకు విత్తనాలు కొనుగోలు చేయడానికి బళ్లారికి బైక్‌పై వెళ్లారు. విత్తనాలు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బాదనహాళ్ వద్ద బ్రిడ్జికి ఎడమవైపు ఉన్న ముళ్ల పొదలకు నిప్పు అంటించారు. దీంతో ఆ మార్గంలో దట్టమైన పొగ అలుముకుంది. ఎదురుగా వచ్చే వాహనాలు ఏవీ కనిపించలేదు. ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న కొల్లారప్ప అదే వేగంతో పొగలో నుంచి ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఎదురుగా లారీ వీరిని ఢీకొట్టింది. కొంత దూరంవరకూ లాక్కెళ్లింది. ఇద్దరిపై లారీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందారు. లారీడ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. కొల్లారప్ప, రమేష్ కర్ణాటకలోని మాసుపల్లి గ్రామంలో ఒకే ఇంటిలో అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. కొల్లారప్పకు భార్య, ముగ్గురు సంతానం ఉండగా, రమే్‌షకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తోడళ్లుళ్ల మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.