శ్రీకాకుళం జిల్లా, నందిగాం, కొత్తగ్రహారం సచివాలయంలో వైఎస్‌ఆర్ పింఛన్ కానుక కింద అందించాల్సిన రూ.80 వేలు నగదు చోరీకి గురైంది. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక గ్రేడ్-5 కార్యదర్శి మీనాక్షి వలంటీ ర్లకు అందించేందుకు ఈ మొత్తాన్ని తీసుకువచ్చి తాను కూర్చున్న టేబుల్‌పై పెట్టి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఆ మొత్తం లేకుండాపోయింది. ఈ విషయాన్నిపై అధికారులు ఆమె తెలిపింది. ఇదిలావుంటే ఈ మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులంతా వేసుకొని ప్రస్తుతం లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ ఘటనపై ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు.