టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పులకేశి లోకేష్ ఓ మాలోకమని.. ఆయన యువగళం జనం లేక వెలవెలపోతోందన్నారు. పాదయాత్ర చేసి లోకేష్ ఉన్న పరువు కూడా తీస్తున్నాడని, ఆ పార్టీ వాళ్లే అంటున్నారన్నారు. పులకేశి లోకేష్ దెబ్బకి టీడీపీ నేతలకి చుక్కలు కనిపిస్తున్నాయన్నారు. లోకేష్ యాత్రకి ఎఫెక్ట్ అని పవన్ వారాహిని కూడా ఆపేశారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ టీడీపీ రాష్ట్ర నాయకుడని ఎద్దేవా చేశారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేస్తుందని లోకేష్ చెప్పాలని సవాల్ విసిరారు. 175 చోట్లా పోటీ చేస్తామని తమ అధినేత వైఎస్ జగన్ చెప్పారన్నారు. పొత్తు లేకుండా చంద్రబాబు ఎప్పుడైనా పోటీ చేశాడా? అని నిలదీశారు. జగన్ మొదటి నుంచీ సింగల్గా సింహంలా ముందుకు సాగుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.