ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని సర్కారుతో పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీజేఏసీ-అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన టీవీ ఫణి పేర్రాజు చెప్పారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఏపీఆర్‌ఎ్‌సఏ భవనలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ .... ప్రతినెలా ఒకటవ తేదీన జీతాలు తీసుకొనే పరిస్థితి ఉద్యోగ, ఉపాధ్యాయులకు లేదన్నారు. ఉద్యోగులు దాచుకొన్న డబ్బును కూడా సకాలంలో పొందలేక పోతున్నట్లు చెప్పారు. పీఎఫ్ డబ్బు అందక ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయనీ, చేతులో డబ్బుల్లేక ఉన్నత చదువులూ చదవలేని పరిస్థితులు దాపురించాయన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని మండిపడ్డారు. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 9 నుంచి కార్యాచరణ ప్రకారం పోరాటం చేయనున్నట్లు చెప్పారు. జేఏసీ నాయకులు బృందాలుగా విడిపోయి ఉద్యోగులతో మమేకమై డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ఏపీజేఏసీ-అమరావతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి యేటూరు చెంచురామయ్య, నాయకులు బొబ్బా మురళి, ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.