విజయవాడ భవానిపురం కోళ్ల ఫోరం రోడ్లో ఒక వికలాంగురాలు నివాసం వుంటూ తన ఇంటి వద్ద ఒక బడ్డి కొట్టులో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక 40వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నా క్రమంలో తమకు బడ్డి కావాలని ప్రస్తుతం వున్న బడ్డీ పాడై ఇబ్బందులు పడుతున్నాం అని చేయూత అందించాలని కోరగా స్పందించిన వెలంపల్లి బడ్డి త్వరలో ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం శుక్రవారం నాడు వెలంపల్లి ఫౌండేషన్ సభ్యులైన వెలంపల్లి రాఘవ నరసింహారావు, కొనకళ్ల విద్యాధర రావు ఇరువురు కలిసి ఆమెకు బడ్డీని అందించారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ కార్పొరేటర్ యారాడ్ల ఆంజనేయరెడ్డి డివిజన్ నాయకులూ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.