నరసాపురం పరిధిలో గంజాయి విక్రయిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 25 కేజీలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గంజాయి విలువ సుమా రు రూ.2.50 లక్షలు ఉంటుందని చెప్పారు. నరసాపురం ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో నిఘా పెట్టామ న్నారు. ఈక్రమంలో బుధవారం విశాఖ నుంచి గంజాయి వచ్చిందన్న సమాచారంతో పట్టణంలోని వీవర్స్ కాలనీకి సమీపంలోని జంగంవారి వీధిలో పోలీసులు దాడి చేశారన్నారు. నిందితులు పారిపోయేందుకు ప్రయ త్నించినా వారిని వెంబడించి పట్టుకుని అరెస్టు చేశామన్నారు. నిందితుల్లో పట్టణానికి చెందిన షేక్ హుస్సేన్, బందెల రోహిత్, మహమ్మద్ రషీద్, ఈతకోట ఆనందకుమార్, గుబ్బల రమేష్, పృథ్వీసాయి, పిచ్చుక ఉదయ్ కిరణ్, షేక్ బాజీ, బాలం రవికుమార్‌లతో పాటు ఓ బాలుడు ఉన్నారన్నారు. విచారించగా పాడేరు నుంచి తీసుకొస్తున్నట్టు తేలిందన్నారు. వీరికి సరఫరా చేసే వ్యక్తిని అరెస్టు చేసేందుకు పోలీస్ టీమ్‌ను అక్కడకు పంపామన్నారు. ఈ కేసులో మైనర్ తోపాటు 11 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడు షేక్ హుస్సేన్ పంచాయతీరాజ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూ సస్పెండ్ అయ్యాడన్నారు.