రెండు రోజుల పాటు జరుగనున్న ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, జీఎంఆర్ సభావేదికపైకి చేరుకున్నారు. సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఏర్పాట్లు జరిగాయి. సదస్సుకు పలు దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరుకానున్నారు. సమ్మిట్‌ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామిక వేత్తలు మాట్లాడనున్నారు.