తిరుమలలో మార్చి 1 నుంచి ‘‘ఫేస్ రికగ్నిషన్’’ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు. ఈ విధానంతో నిజమైన భక్తులే గదులు పొందుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని ఇంకా పటిష్టం చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపునకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ యాప్ ద్వారా దర్శనం, లడ్డూల పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది.