కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకునే వారి కోసం ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పేరుతో రూ.50 వేల నుండి రూ.10 లక్షల రుణాలను అందిస్తుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు, లేదా ఇప్పటికే బిజినెస్ చేస్తూ దాన్ని విస్తరించాలనుకునేవారు ఈ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ రుణం కోసం దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లేదా https://www.udyamimitra.in/ లింక్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.