జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ లకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అంటూ ఛాలెంజ్ చేశారు. ఈ విషయాన్ని పాదయాత్రలో లోకేష్ ప్రకటించగలడా అంటూ ప్రశ్నించారు. మాకు పొత్తులతో అవసరం లేదు. సింగిల్ గానే పోటో చేస్తామని పేర్కొన్నారు. సింగిల్ గా పోటీ చేయలేని వీళ్లా సీఎం జగన్ గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు.