ఏపీలో పెట్టుబడులపై అదానీ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదానీ కొన్ని విషయాలను వెల్లడించారు. అదానీ గ్రూప్ ఏపీలో రెండు కొత్త సిమెంట్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతోందని, దీంతో పాటు 15,000 మెగావాట్ల పునరుత్పాదక పవర్ ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతాయని, డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.