త్రిపురలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా శుక్రవారం తన రాజీనామాను అగర్తలలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు కొనసాగించాలని కోరింది.ఈరోజు నేను గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించానని, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఎంగా కొనసాగాలని గవర్నర్ నన్ను కోరారని, మార్చి 8న ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉందని సాహా అన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రకారం, బీజేపీ దాదాపు 39 శాతం ఓట్లతో 32 సీట్లు గెలుచుకుంది. తిప్ర మోత పార్టీ 13 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 11 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది.