విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్-2023)పై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. అచ్చెన్నాయుడు ఇప్పుడిప్పుడే నిద్ర లేచి మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారని, ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన స్పందనను మెచ్చుకోక పోయినా ఫర్వాలేదు కానీ ఇలా అడ్డగోలుగా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. జీఐఎస్-2023 తొలిరోజు విజయవంతమైందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. తమ ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు బడా కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. 20 రంగాల్లో పెట్టుబడులపై ఆసక్తి చూపినట్లు వివరించారు. ఒక్కరోజులోనే రూ.11.87 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.