ప్రతిష్టాత్మకమైన సెంటర్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ , పవర్ నీరు విద్యుత్తు ఇంధన పొదుపు లో విశాక జీవీఎంసీ కి రెండు అవార్డులు లభించాయని జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు తెలిపారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీరు అందించే ప్రాజెక్టులలో 24 x 7 నీటి సరఫరా సంబంధించన లక్ష్యం 60000కు కాగా 25 వేల గృహాలకు ఈ పథకం అందించడంలో ముందుందని, ఈ పథకం 20 జిల్లాలలో అమల పరచడం జరుగుతుందని, నరవ ఎస్ టి పి నుండి 29 ఎం ఎల్ డి శుద్ధి చేసిన నీటిని హెచ్పిసిఎల్ లకు అందించడం జరుగుతుందని, అలాగే మారికవలస నుండి జిందాలకు ముడసిర్లోవ ఎస్ టి పి నుండి గోల్ఫ్ కోర్టుకు పచ్చదనాన్ని పెంపొందించేందుకు మురికి నీటి శుద్ధి చేసి అందించడం జరుగుతుందని, దీనికిగాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు జీవీఎంసీ కి ప్రతిష్టాత్మకైనా అవార్డులను మార్చి 3వ తేదీన అందించడం జరిగిందని సందర్భంగా కమిషనర్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అందించారని కమిషనర్ పేర్కొన్నారు.