ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో రోజూ భారీగా ఒప్పందాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 12:30 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023(జీఐఎస్‌) రెండో రోజు శ‌నివారం ఘనంగా ప్రారంభమైంది. ఏయూ మైదానంలో జ‌రుగుతున్న స‌మ్మిట్ ప్రాంగ‌ణానికి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజిని, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఘనస్వాగతం పలికారు. జీఐఎస్‌ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలకు స్వాగతం పలికారు. అనంత‌రం కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి, పారిశ్రామిక వేత్త‌ల‌తో క‌లిసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జీఐఎస్ వేదిక‌పైకి ఆశీనుల‌య్యారు.


మొదటి రోజు రూ. 11. 87 లక్షల కోట్ల పెట్టుబడులకు గానూ 92 ప్రముఖ సంస్థలతో ఎంవోయూలు చేసుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం. శ‌నివారం రూ. 1. 15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలను కుదుర్చుకోనుంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రెండోరోజు పలు దిగ్గజ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంది. రెండోరోజు ప్ర‌భుత్వంతో ఒప్పందాలు చేసుకున్న ప‌లు కంపెనీలు.


ఎకో స్టీల్‌ ఎంవోయూ రూ. 894 కోట్లు, బ్లూస్టార్‌ ఎంవోయూ రూ. 890 కోట్లు, ఎస్‌2పీ సోలార్‌ సిస్టమ్స్‌ ఎంవోయూ రూ. 850 కోట్లు, గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ ఎంవోయూ రూ. 800 కోట్లు, ఎక్స్‌ప్రెస్‌ వెల్‌ రీసోర్సెస్‌ ఎంవోయూ రూ. 800 కోట్లు, రామ్‌కో ఎంవోయూ రూ. 750 కోట్లు, క్రిబ్కో గ్రీన్‌ ఎంవోయూ రూ. 725 కోట్లు, ప్రకాశ్‌ ఫెరోస్‌ ఎంవోయూ రూ. 723 కోట్లు, ప్రతిష్ట బిజినెస్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు, తాజ్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు, కింబర్లీ క్లార్క్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు, అలియన్న్‌ టైర్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 679 ‍కోట్లు, దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు, అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు, డీఎక్స్‌ఎన్‌ ఎంవోయూ రూ. 600 కోట్లు, ఈ-ప్యాక్‌ డ్యూరబుల్‌ ఎంవోయూ రూ. 550 కోట్లు, నాట్‌ సొల్యూషన్న్‌ ఎంవోయూ రూ. 500 కోట్లు, అకౌంటిఫై ఇంక్‌ ఎంవోయూ రూ. 488 కోట్లు, కాంటినెంటల్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజీస్‌ ఎంవోయూ రూ. 400 కోట్లు, నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎంవోయూ రూ. 400 కోట్లు, ఆటమ్‌స్టేట్‌ టెక్నాలజీస్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు, క్లేరియన్‌ సర్వీసెస్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు, చాంపియన్‌ లగ్జరీ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు, వీఆర్‌ఎమ్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 342 కోట్లు, రివర్‌ బే గ్రూప్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు, హావెల్స్‌ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు, సూట్స్‌ కేర్‌ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు, పోలో టవర్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు


-ఇండియా అసిస్ట్‌ ఇన్‌సైట్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు, స్పార్క్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు, టెక్‌ విషెన్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు, మిస్టిక్‌ పామ్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు, నియోలింక్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు, ఎండానా ఎనర్జీస్‌ ఎంవోయూ రూ. 285 కోట్లు, అబ్సింకా హోటల్స్‌ ఎంవోయూ రూ. 260 కోట్లు


-సర్‌ రే విలేజ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు, హ్యాపీ వండర్‌లాండ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూరూ. 250 కోట్లు


-చాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు, టెక్నోజెన్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు, పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు, ఎకో అజైల్‌ రిసార్ట్‌ ఎంవోయూ రూ. 243 కోట్లు, ఎల్జీ పాలిమర్స్‌ ఎంవోయూ రూ. 240 కోట్లు, హైథియన్‌ హ్యూయన్‌ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు, గోకుల్‌ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు ఒప్పందాలు జ‌రిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com