వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ గిరిష పిఎస్ శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా రామాపురం మండలం, కాకులారం గ్రామంలో సర్వే నెంబర్ 628/2 లో 96. 8 ఎకరాలు, మరియు బండపల్లి నందు సర్వే నెంబర్ 324 లో108. 15 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం పరిశీలించారు. రాయచోటి నియోజకవర్గంలో ఏపీఐఐసీ (ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) వారి ద్వారా వివిధ పరిశ్రమలు స్థాపించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి రాయచోటి నియోజకవర్గంలో మినిమం 500 నుంచి1000 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించాలని జిల్లా కలెక్టర్ నియోజకవర్గంలోని తహసిల్దార్లకు సూచించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa