ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐ ప్రత్యేక కోర్టులో సిసోడియాకు నిరాశ,,,బెయిల్ పిటిషన్ ను 10న విచారిస్తామన్న కోర్టు

national |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 12:10 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ఆయనకు నిరాశ ఎదురైంది. సిసోడియా సీబీఐ కస్టడీని మరో రెండు రోజుల పాటు కోర్టు పొడిగించింది. సిసోడియా కస్టడీ ముగియడంతో ఆయనను ఈరోజు కోర్టులో సీబీఐ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. విచారణకు సిసోడియా సహకరించలేదని... ఆయనను మరో మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టును సీబీఐ కోరింది.  సీబీఐ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు మూడు రోజులు కాకుండా మరో రెండు రోజులు కస్టడీని పొడిగించింది. మరోవైపు బెయిల్ విషయంలో కూడా సిసోడియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను ఈ నెల 10న విచారిస్తామని కోర్టు తెలిపింది.  







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com