ఏపీలో టీడీపీ నేత వరుపుల రాజా (47) కన్నుమూశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఆయన శనివారం రాత్రి తీవ్ర గుండెపోటు రావటంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో రాత్రి 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజ డీసీసీబీ చైర్మన్గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆయన మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.