ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 17 నుంచి ప్రారంభమై మార్చి 23న ముగుస్తాయి. 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను మార్చి 21న సమర్పించనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా అరెస్టయిన తర్వాత కేబినెట్ మంత్రి కైలాష్ గహ్లోట్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ కేబినెట్‌కు మనీష్ సిసోడియా రాజీనామా చేసిన తర్వాత, కొత్త మంత్రులను క్యాబినెట్‌లోకి తీసుకోని వరకు ఆయన శాఖలను కేబినెట్ సహచరులు - కైలాష్ గహ్లోట్ మరియు రాజ్ కుమార్ ఆనంద్‌లకు కేటాయించారు.మార్చి 2న, గహ్లోట్ తనకు కొత్తగా కేటాయించిన శాఖల బాధ్యతలు చేపట్టారు. సంబంధిత కార్యదర్శులు, కమిషనర్లతోనూ ఆయన సమావేశమయ్యారు.ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమర్ధవంతమైన నాయకత్వంలో పౌర కేంద్రీకృత మరియు ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నామని గహ్లోట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.