విజయవాడలోని భవానీపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అశోకా ట్రేడర్స్కు చెందిన గృహోపకరణాల గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం గోదాము నుంచి మంటలు చెలరేగడంతో.. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నించారు. గోదాములో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
అయితే.. ఇళ్ల మధ్యనే గోదాము ఉండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అగ్ని ప్రమాదం జరిగిన భవనం లోపలికి వెళ్లేందుకు ఒకే దారి ఉండటంతో.. మంటలార్పడం ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. ఇటీవల కూడా విజయవాడలో Novotel హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ సెల్లార్లో ఉన్న కరెంటు బోర్డులో మంటలు చెలరేగాయి. హోటల్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఇలా వరుసగా ప్రమాదాలు జరగడం కలకలం రేపుతోంది.