ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మిట్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: నాదెండ్ల మనోహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 11:37 PM

గ్లోబల్ సమ్మిట్ పేరుతో రూ.170 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. చిత్తశుద్ధితో పనులు చేస్తే.. మెరుగైన పెట్టుబడులు వాటికంతట అవే వస్తాయని.. ఇందుకు జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు.విశాఖపట్నం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఓ బూటకమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంకెల గారడీతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. సముద్ర ఆధారిత ఉత్పత్తుల (సీ ఫుడ్స్) ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డును సీ ఫుడ్స్‌లో కలిపి చూపడాన్ని బట్టి చూస్తే.. ఈ మంత్రులు ఎంత అవివేకంతో ఉన్నారో అర్థం అవుతోందన్నారు.


రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను తాము తప్పుబట్టడం లేదని, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మాత్రం ఖండిస్తున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు. మరోవైపు.. ఇప్పటం గ్రామంలో కూల్చివేతలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటంలో అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆందోళనకు దిగుతామన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో భారీ సభ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే పోలీసుల అనుమతి కూడా తీసుకున్నామని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com