నూజివీడు పట్టణ ప్రాంతంలో రోజురోజుకీ వీధి కుక్కల బెడద పెరిగిపోతోందని ప్రజలు సోమవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడచిన మూడు రోజులలో 16 మంది కుక్కకాటుతో అస్వస్థతకు గురయ్యారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. వీధి కుక్కలను పట్టి సురక్షితంగా అటవీ ప్రాంతాలలో విడిచిపెడతామని కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. ఆ మేరకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.