బాపట్ల మండలం ముత్తాయపాలెం, అడవి పంచాయతీల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు, ప్రజలకు ఉచిత వైద్య సేవల అందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఉచిత నేత్ర వై ద్య శిబిరం నిర్మాణ పనులు ఆదివారం జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరం నిర్వహిస్తాం అని నిర్వాహకులు తెలిపారు. మండలం లోని ముత్తాయపాలెం సచివాలయం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల ప్రజానీకానికి, మత్స్యకారులకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లను అందిస్తామని బజరంగ్ ఫౌండేషన్ సీఈవో అంబటి మురళీకృష్ణ తెలిపారు. ఈ శిబిరాన్ని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ప్రారంభించనున్నారు. కావున అయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.