జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్మాన్ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ఫర్ హెల్త్ ర్యాలీని నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియం నుండి రాజరాజేశ్వరి టెంపుల్ మీదుగా జిజిహెచ్ వరకు సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని డియంహెచ్ఓ డా. యం. పెంచలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ వైద్యాధికారులు, డియంహెచ్ఓ సిబ్బంది, వివిధ నర్సింగ్ స్కూల్ విద్యార్థులు, ఐయంఎ రాష్ట్ర నాయకులు డా. అశోక్, డెమో బి. శ్రీనివాసరావు, సిసి మురళి , రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, జిల్లా పి. ఎం. పి నాయకులు శాఖవరపు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.