1989 బ్యాచ్ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ అధికారి ఎస్ఎస్ దూబే సోమవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) గా బాధ్యతలు స్వీకరించారు. 2023 మార్చి 6 నుండి అమల్లోకి వచ్చేలా భారత ప్రభుత్వం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA)గా దూబేని నియమించింది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.దూబే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖతో పాటు ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్‌లో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్‌గా కూడా పనిచేశారు.తన సెంట్రల్ డిప్యుటేషన్‌పై, దూబే గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు జాయింట్ సెక్రటరీ మరియు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు.