ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమిర్పూర్ జిల్లా కుంద్రా గ్రామంలో ఉంది. ఆ గ్రామంలో హోలీ ఆడవాళ్లు మాత్రమే ఆడతారట. ఈ సంప్రదాయం ఎందుకు వచ్చిందో ఓ కథ కూడా ఉంది. ఒకానొకప్పుడు ఈ గ్రామంలో అందరూ హోలీ ఆడుతున్న సమయంలో దొంగలు రాజ్‌పాల్ అనే వ్యక్తిని కాల్చి చంపారట. అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు హోలీ నిర్వహించలేదట. ఆ సమయంలో మహిళలు ధైర్యం చేసి మళ్లీ హోలీ మొదలుపెట్టారు. దీంతో మగవారికి ఆ వేడుకల్లో స్థానం లేదట.