నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర 37వ రోజుకు చేరుకుంది. ఈరోజు పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్న లోకేష్... మైనారిటీలు, విద్యార్థులు, రైతులు, పలువురు గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లోకేష్ 472.7 కిలోమీటర్ల మేర నడిచారు. ప్రతీ రోజు పది కిలోమీటర్లపైనే యువనేత పాదయాత్ర చేస్తున్నారు. స్థానికులు, పలు సామాజిక వర్గాలు, యువకులు, మహిళలతో మాటామంతి నిర్వహిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వైసీపీ పాలనలో తాము ఎదుర్కుంటున్న కష్టాలను లోకేష్ ముందు వారు ఏకరువుపెట్టారు. దీంతో నేనున్నానంటూ వారికి లోకేష్ అభయమిస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.