జ్వరాన్ని కొన్ని సులభ పద్ధతుల్లో తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తులసి టీని రోజుకు 2, 3 సార్లు తాగడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే వెల్లుల్లిని తీసుకోవాలని, అల్లంలోనూ యాంటీ వైరల్ లక్షణాలున్నాయని, ఇవి జ్వరాన్ని తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. గంధం పేస్ట్ ను నుదిటికి రాయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు.