అత్యాచారం నుండి తప్పించుకునేందుకు ఓ యువతి భవనం పైనుండి దూకేసిన ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటుచేసుకుంది. స్క్వాష్ ప్లేయర్ అయిన బాధిత యువతి(19) ఈ నెల 5న సర్టిఫికెట్లు తీసుకునేందుకు కోచ్ మురుగేశన్(48) ఇంటికి వెళ్లగా, అతను యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో యువతి బిల్డింగ్ మొదటి అంతస్తు నుండి దూకి తప్పించుకుంది. అనంతరం కోచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa