శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా మైక్రో అబ్జర్వర్ లు( సూక్ష్మ పరిశీలకులు) కీలకంగా విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జల్లే పల్లి వెంకట రావు అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్ లకు తుది విడత శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా నిశితంగా పరిశీలించాలన్నారు. పట్టభద్రులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కొనేలా మహిళలు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. మైక్రో అబ్జర్వర్ ల డైరీ లోని నిబంధనలు పాటించాలని, చెక్ లిస్ట్ ప్రకారం సరిచూసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. 13 తేదీన పోలింగ్ కు ముందు పారదర్శకతకు ఖాళీ బ్యాలెట్ బాక్స్ ను ఏజెంట్ సమక్షంలో చూపించి పోలింగ్ ప్రారంభించాలని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే పట్టభద్రులకు 12 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల కమిషన్ అనుమతించిందని, గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనంతరం ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు పగడ్బందిగా నిర్వహించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణను అందించారు. మైక్రో అబ్జెర్వర్ల అనుమానాలను నివృత్తి చేశార. ఈ కార్యక్రమంలో మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.