పార్వతీపురం మండలం, బాలగుడబ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ వీధిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రికృష్ట దేవాలయం నిర్మాణానికి బుధవారం నిర్వహించిన శంఖుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అలజంగి జోగారావుని ఆహ్వానించగా ఆహ్వానాన్ని మేరకు కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజా ప్రతినిధులు, యాదవ సంఘం సభ్యులు, ప్రజలు సమక్షంలో భూమి పూజ చేసి ఘనంగా శంఖుస్థాపన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలందరితో మాట్లాడుతూ ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమానికి యాదవ సంఘం సభ్యులు అంతా పూనుకుని శ్రీ కృష్ట దేవాలయం నిర్మాణానికి తన చేతులు మీదుగా శంఖుస్థాపన నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అనుకున్న సమయంలోగా ఆలయం నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పండు, మాజీ సర్పంచ్ మువ్వల సత్యం నాయుడు, ఎంపీటీసీ వి నీలవేణి, ఉప సర్పంచ్ వి శ్రీనివాసరావు, యాదవ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.