ఇటీవల పలాస ప్రభుత్వ హాస్పత్రిలో డాక్టర్ లేకుండా నర్సులు డెలివరీ మొదలుపెట్టి, పసికందు వృత్తికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ ఎస్. అప్పుల రాజుకు రాజాం సురేశ్ వినతి పత్రాన్ని గురువారము అందించారు. తమ తప్పును కప్పి పుచ్చుకోవడానికి హాస్పిటల్ సూపరిడెంట్ చిన్నంనాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని, హాస్పిటల్ లో పనిచేస్తున్న సిబ్బంది దిగజారు తత్వాన్ని బాహాటంగా విమర్శించారు. తన కన్న బిడ్డను ఆసుపత్రి సిబ్బంది దారుణంగా చంపేసారని ఆయన కన్నీరు మున్నీరు ఆయ్యారు. ప్రభుత్వం ఇచ్చే జీతాల్ని తీసుకొని, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్నారని ఆయన అన్నారు. దీనివలన పేదవానికి వైద్యం కరువుతుందని, ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. హాస్పిటల్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని మంత్రికి కోరారు.