ఏపీలోని మదనపల్లెలో ఓ వృద్ధుడి కిడ్ని నుంచి 3వేల రాళ్లను బయటకి తీశారు డాక్టర్లు. ఆద్య ఆస్పత్రిలో కుట్లు అవసరం లేకుండా కీ హోల్ సర్జరీ ద్వారా వృద్ధుడి కిడ్నీలో రాళ్లను తొలగించారు. ఇంతపెద్ద మొత్తంలో రాళ్లను తొలగించడం ఇదే తొలిసారి అని, చాలా అరుదైన ఘటన అని వైద్యులు తెలిపారు. కలుషిత ఆహారం, కలుషిత నీరు, ఎక్కువగా పెయిన్‌కిలర్స్ వాడకం వల్ల కిడ్నీ వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.