ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని దించే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ హైకమాండ్ ముందు కొంతమంది ఎమ్మెల్యేలు.. ప్రతిపాదనలు పెట్టినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మరి అధిష్టానం అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనేది చూడాలి. అయితే ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం , విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ , గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి ఇప్పటికే దూరమయ్యారు. వారు వైసీపీకి మద్దతు ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్ జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సదరు ఎమ్మెల్యేలు విప్‌ను ఉల్లంఘిస్తే వారిపై ఈసీకి ఫిర్యాదు చేయవచ్చని టీడీపీ భావిస్తోంది.