గుంటూరు జిల్లాలో గురువారం రవాణా శాఖ అధికారులు మొబైల్ పొల్యూషన్ వాహనాన్ని తనిఖీ చేశారు. ధ్రువీకరణ పత్రాలు, వాహన స్థితిగతుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని పలు వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ కు సంబంధించి ఎనిమిది, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి మూడు, రాంగ్ పార్కింగ్లో ఉన్న ఒక వాహనంపై కేసులు నమోదు చేశారు. ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయవద్దని సూచించారు. పొల్యూషన్ కు సంబంధించి వాహనా యాజమాన్యులకు తగిన రసీదు ఇవ్వాలని చెప్పారు. తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు గోపాల్ పాల్గొన్నారు.