ఏప్రిల్ లో జరగనున్న 10వ తరగతి పరీక్షలలో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ప్రీ ఫైనల్ పరీక్షల్లో. విద్యార్థుల మార్కులను బట్టి సబ్జెక్ట్ వారీగా విశ్లేసించుకొని ఫలితాలు మెరుగ్గా వచ్చేలా చూడాలని తెలిపారు. శుక్రవారం టీమ్ కాన్ఫరెన్స్ ద్వారా మోడల్ స్కూల్స్, కెజిబివి, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ తో మాట్లాడారు. ప్రీఫైనల్ పరీక్ష ల్లో సబ్జెక్ట్ వారీగా ఫెయిల్ అయిన వారు ఏ కారణంగా ఫెయిల్ అయ్యారని వివరణ అడిగారు.
ఏ సబ్జెక్టు ల్లో వెనకబడి ఉన్నారో వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అదనపు ప్రిపేరేషన్ తరగతులను నిర్వహించాలని అదేశించారు. ప్రాక్టీస్ సెషన్ పేరుతో పిల్లల పై అధిక వత్తిడి పెట్టవద్దని, వారి సమర్థతను బట్టి దగ్గరే వుండి వారిని చైతన్య పరచి, వారితో చదివించాలని స్పష్టం చేసారు. ఉన్నత చదువులు చదివే స్థోమత, సమర్ధత లేని వారికి పాలిటెక్నిక్ కు అప్లై చేయించాలని అన్నారు. కెరీర్ గైడెన్స్ పై కూడా వారికి అవగాహన కలిగించాలన్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అవసరమగు కాస్ట్ సర్టిఫికెట్ల కోసం సచివాలయంలో ఇపుడే దరఖాస్తు చేయాలని, తదుపరి అడ్మిషన్స్ కు ఇబ్బంది లేకుండా ఉండేలా చూడాలని అన్నారు.