ఏపీ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఉద్యోగులు తమ విధుల నుంచి ఓ గంట ముందుగా వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ వెసులు బాటు కల్పించింది.