ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపులు ఇతర వర్గాలను కలుపుకొనిపోతే అధికారం సాధ్యం: వపన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 08:00 PM

కాపుల ఒక్కరి వల్ల అధికారం రాదని.. కానీ కాపులు ఇతర వర్గాలను కలుపుకుపోతే కచ్చితంగా అధికారం సాధించగలమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందరూ కాపు కాపు అంటారు.. కానీ కాపులు తనను కాపుగా గుర్తించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. వారు నిలబడితే కచ్చితంగా అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాపులు గోదావరి జిల్లాల్లో మాత్రమే లేరు.. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉన్నారని.. అందరూ కలిసి ఉంటే దక్షిణ భారతదేశంలో.. అతి పెద్ద సమాజం కాపు సమాజం అవుతుందని వ్యాఖ్యానించారు. 


మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో.. కాపు సంక్షేమ సేన సమావేశం జరిగింది. దీంట్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. '1000 కోట్ల ప్యాకేజీ అంటారు. అసలు డబ్బుతో పార్టీలు నడపలేము. నాకు భాద ఉంది కాబట్టి పార్టీ నడుపుతున్నాను. లక్షలాది మంది ప్రజల జీవితాల కోసం నడుపుతున్నాను. జనసేన ప్రజల భావోద్వేగాలను నమ్మింది. డబ్బును నమ్మలేదు. ఒక పార్టీని పెట్టి ప్రతికూల పరిస్థితుల్లో 10 సంవత్సరాలు నడపటం అంత సులువు కాదు. ఎంతో బాధ్యతతో వచ్చాను కాబట్టి నిలబడ్డాను' అని పవన్ వివరించారు.


'సంఖ్యాబలం ఎంత ఉన్నా కూడా.. రాజకీయ బలం లేకపోతే అధికారం చేజిక్కిచ్చుకొలేం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఉన్నాయి. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా రిజర్వేషన్ అడుక్కునే పరిస్థితి ఉంది. కులాన్ని పట్టించుకునే నాయకులు ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసి.. అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్న హరిరమ జోగయ్యకు ధన్యవాదాలు. బయట కులాలను విమర్శించడం కాకుండా.. మన కులంలో ఉన్న తప్పులను సరిచేసుకోవాలి. కాపులు అధికారంలోకి వస్తే.. ఇతర కులాలకు అన్యాయం జరుగుతుంది అనే తప్పుడు ప్రచారం జరుగుతుంది' అని పవన్ వ్యాఖ్యానించారు.


'కాపుల్లో ఒక తరం నాయకులు త్యాగానికి సిద్దం అయితేనే.. రాజ్యాధికారం సాదించుకొగలం. 10 మందికి ఇచ్చే స్థాయిలో కాపులు ఉండాలి. దేహీ అనే స్ధాయిలో ఉండకూడదు. కాపుల కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడాలి. సంఖ్యాబలం ఉంది కదా అని వాళ్లలో వారే గొడవలకి వెళ్లి.. వర్గాన్ని అన్యాయం చేయకండి. ఒక కులంలో ఒక వ్యక్తి చేసిన తప్పును.. ఆ కులానికి ఆపాదించకండి. కులం మొత్తాన్ని శత్రువుగా చూడకండి. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాపులు, బీసీలు, ఎస్సీలలో ఐక్యత ఉండదు. అందుకే కొన్ని కులాలకు మాత్రమే అధికారం అందుతుంది. అందుకే ముందు ఐక్యత రావాలి.. కలిసి నడవాలి' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


'ఒకడు త్యాగం చేయాలి, అవమానాలు పడాలి, నిలబడాలి. అప్పుడే మిగతా వారికి న్యాయం జరుగుతుంది. అధికారం దక్కుతుంది. నేను పుట్టడం కాపు కులంలో పుట్టి ఉండొచ్చు.. కానీ నా మనసు అధికారానికి దూరంగా ఉన్న రెల్లి లాంటి కులాల మధ్య ఉంటుంది. వారికి కూడా రాజ్యాధికారం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా రాజ్యాధికారం చేతకాదు అని మాట్లాడేవారికి.. చెంప పలిగేలా ఎన్నికల ద్వారా సమాధానం చెప్పాలి. కొంతమంది ఈ మధ్య తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటివి నమ్మకండి. వారు అలానే చేస్తారు' అని పవన్ వ్యాఖ్యానించారు.


'కాపు సమాజం బీసీ వర్గాలను, దళితులను కలుపుకుని నడవగలిగితే.. రాజ్యాధికారం ఎప్పటికీ చేజారదు. ఇంత సంఖ్యాబలం ఉండి ఎందుకు కలిసి నడవలేక పోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫ్యుడలిస్టిక్ మనస్తత్వం ఎలా ఉంది అంటే.. మీ కులంలో ఎలాంటి వ్యక్తిని అయినా తిట్టండి.. మీరు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే.. నా దగ్గర వచ్చి చేతులు కట్టుకోండి అనే రకం. నన్ను కాపుల చేత, దళితులు, మైనార్టీలతో తిట్టిస్తారు. వారి వర్గాలతో తిట్టించరు. తెలివిగా మనలో మనకు గొడవలు పెడతారు. వారి రాజ్యాధికారంలో కూర్చుంటారు' అని పవన్ ఆరోపించారు.


'కాపులు సంఘాలుగా విడిపోయాయి. బీసీలు కూడా సంఘాలుగా విడిపోయాయి. వాటిని మండల స్థాయి నుంచి కలిపే ప్రయత్నాలు చేయాలి. రెడ్డి, కమ్మ, క్షత్రియ సామాజికవర్గాల వారికి గౌరవం ఇవ్వాలి. తెలుగుదేశంతో 20 సీట్లకు పోటీ కుదిరింది అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నేను లోపాయికారీ ఒప్పందాలు చేసుకోను. అలా మన గౌరవం తగ్గించే పొత్తులకు వెళ్లను. ఏ ఒక్క జనసైనికుడి ఆత్మగౌరవం తగ్గించే పని నేను చెయ్యను.. ఏ పార్టీ అజెండా కోసం మేము పనిచేయ్యం' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com