రంజాన్ మాసంను పరిగణనలోనికి తీసుకొని ముస్లిం ప్రభుత్వం ఉద్యోగులకు సాయంత్రం వేళనే కాదు ఉదయం పనివేళలో కూడా కాస్త వెసులుబాటు కలిగించేలా మినహాయింపులు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా విన్నతించారు. సాయంత్రం ఇఫ్తార్ కోసం పనివేళలో కాస్త ముందే ఇంటికి వెళ్లే సదుపాయం కల్పించడం సంతోషదాయకమేనని, అయితే ఉదయం కూడా వారు ఉపవాసం కోసం ఉదయం నుంచే మేలుకొనివుండే పరిస్థితి అన్నారు. అందుకు ఆఫీసుకొచ్చే సమయంలో ఉదయంం కాస్త మినిహాయింపులు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సారి పేద ముస్లింలకు తోఫా పథకాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. పేద ముస్లింలు తమ ఆర్థిక పరిస్థితి వల్ల ఇప్పటికీ ఏడాదికోమారు వచ్చే పండుగను కూడా జరుపుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రంజాన్ తోఫా పథకం పేద ముస్లింలకు అందిస్తే అట్టి కుటుంభాలు పండుగు సంతోషాన్ని పొందగలవని ఆయన పేర్కొన్నారు. పేద ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా పథకాన్ని అందించేందుకు వైసీపీ సర్కార్ చర్యలు తీసుకోవాలన్నారు.