కడప నగరంలోని జిల్లా పరిషత్ లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కె. కె. ఎన్ అన్బురాజన్ సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఓటు వేసే క్యూలైనులు, పార్కింగ్ ప్రదేశాలు , ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తీరును జిల్లా ఎస్పీ సోమవారం పరిశీలించారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం విధులు కొనసాగాలని, అక్కడ బందోబస్తు విధులలో ఉన్న పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.