గుంటూరు: పట్టాభిపురం ప్రైవేటు ఉద్యోగి అదృష్టమైనట్లు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకట సత్య హరిష్ ప్రైవేటు ఉద్యోగి. అయిన భార్య ఉమాదేవి పాపకు జన్మనివ్వడంతో ఈ నెల 9వ తేదీన చూసేందుకు వచ్చారు. 12వ తేదీన తాను ఉద్యోగానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ కూడా చేయలేదు. దీంతో ఆయన బావ నీలకంఠేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.