అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును EPFO పొడిగించింది. ఉద్యోగుల పింఛను పథకం 1995 (EPS 95) కింద అర్హులై 2014 సెప్టెంబరు కంటే ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించింది. అంతకు ముందు ఈ గడువు మార్చి 3తో ముగియగా.. ఉద్యోగ, యాజమాన్య సంఘాల విజ్ఞప్తుల మేరకు మే 3 వరకు ఈపీఎఫ్వో పొడిగించింది.