బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, మినిస్టరీ ఆఫ్ హోమ్ ఆఫైర్స్ సంయుక్త ఆధ్వర్యాన విశాఖ కేంద్రకారాగారంలో 'స్టేక్ హోల్డర్స్ కో-ఆర్డినేషన్ అండర్ లీడర్‌షిప్' అంశంపై జైళ్ల శాఖ అధికారులకు కార్యశాల నిర్వహించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యశాలకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్ నుంచి వివిధ హోదాల్లో ఉన్న 21 మంది అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ జైళ్లశాఖ ఐజి డాక్టర్ ఇండ్ల శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అధికారులకు శిక్షణ అనేది అన్ని శాఖలలో ఒక భాగం అని, దీని ద్వారా కొత్త విషయాలను తెలుసుకొనుటకు దోహద పడుతుందని తెలిపారు. మొదటి రోజైన సోమవారం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, టీం బిల్డింగ్ స్కిల్స్ వంటి అంశాలపై అసోసియేట్ డీన్ నందిని, వి. సతీష్ చర్చించారు. ఈ కార్యక్రమంలో విశాఖ కేంద్రకారాగారం పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్, డిఎస్‌పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.