విశాఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి అనుబంధంగా గల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఇటిఇ) ఆధ్వర్యాన జాతీయ స్థాయి సాంకేతిక యువజనోత్సవం ''ఐస్క్వేర్ ఆర్-2023'' నిర్వహిస్తున్నట్లు విభాగాధిపతి ప్రొఫెసర్ జెబి. సెవెన్త్‌లైన్ తెలిపారు. విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులతో పాటు వర్క్‌షాపు, సాంకేతిక ప్రసంగాలు 16, 17 తేదీలలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ సాంకేతిక ఉత్సవం నేపథ్యంలో రహదారి భద్రతపై వాక్‌థాన్, ఫ్లాష్ మాబ్‌లను నిర్వహించామని పేర్కొన్నారు. దాదాపు 200 మంది విద్యార్థులతో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ సలహదారులు డాక్టర్ ఎస్. నీరజ, డాక్టర్ పి. రాజు, కెవి. సత్యకుమార్, సిఎస్‌ఇ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్. శిరీష పాల్గొన్నారు.