ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటు హక్కును వినియోగించుకున్న పోతుకుంట రమేష్ నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 04:05 PM

పట్టుబద్రుల ఎన్నికల్లో రాజంపేట మన్నూరు ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి పోతుకుంట రమేష్ నాయుడు తన ఓటును హాకును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికలని ఓటు వినియోగించుకున్న ఓటర్లు చూస్తే అర్థమవుతుందన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు చేసినా, డిగ్రీలు లేని వారికి కూడా ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఓటర్లందరూ ఎండను సైతం లెక్కచేయకుండా బారులు తీసి ఓటును వినియోగించుకోవడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేటతెల్లమవుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa