దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కి ఎలా ఆప్తులు ఉన్నారో ఆయన తనయుడడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కూడా అలాంటి ఆప్తులే ఉన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా.. ఓ వ్యక్తి మాత్రం ఆయనతో కచ్చితంగా కనిపిస్తారు. ఆయనే జగన్ పీఏ కే.నాగేశ్వర్ రెడ్డి. అందరూ ఆయనను కేఎన్ఆర్ అంటారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. ఆయన చెప్పే పనుల్ని ఇట్టే చేసి పెట్టే చాకులాంటి వ్యక్తిగా.. కేఎన్ఆర్‌కు పేరుంది. దాదాపు పుష్కర కాలంగా జగన్ వెంటే ఉంటున్న కే.నాగేశ్వరరెడ్డిని జగన్ అధికారికంగా తన పీఏగా ఎంపిక చేసుకున్నారు కూడా.
అయితే.. చాలామందికి కేఎన్ఆర్ గురించి తెలియదు. ఎందుకంటే.. ఆయనకు జగన్ తప్ప వేరే లోకం లేదని కేఎన్ఆర్ సన్నిహితులు చెబుతారు. దీంతో అసలు కేఎన్ఆర్ ఎవరు.. ఆయనది ఏ ఊరు.. అతనంటే జగన్‌కు ఎందుకు అంత నమ్మకం అని చాలా మంది ఆరా తీస్తారు. కేఎన్ఆర్ సొంతూరు కడప. ఆయన జగన్ పీఏగా పనిచేయక ముందు.. వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ ఆక్రమంలోనే.. జగన్ ఎంపీగా ఉన్నప్పుడు దగ్గరయ్యారు. జగన్ తరఫున కడపలో అన్ని పనులు చక్కబెట్టేవారని టాక్ ఉంది. అంతేకాదు.. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలోనూ నాగేశ్వరరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
కేఎన్ఆర్.. జగన్ మనసెరిగి పని చేస్తారని చాలా మంది నేతలు చెబుతారు. జగన్‌కు ఎప్పుడు ఏం కావాలో కేఎన్ఆర్‌కు తెలుసని అంటారు. అంతే కాదు.. జగన్ మూడ్‌ను బట్టి కేఎన్ఆర్ నడుచుకుంటారని.. జగన్‌తో ఎవరు మాట్లాడాలన్నా ఆయనకే ఫోన్ చేస్తారు. జగన్ ఎప్పుడేం కోరుకుంటారో నాగేశ్వర రెడ్డి ఇట్టే పట్టేస్తారన్న పేరు కూడా ఉంది. అందుకే.. జగన్ ఎక్కడికి వెళ్లినా కేఎన్ఆర్ తోడుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జగన్‌కు నీడలా ఆయన ఉంటారని చాలా మంది చెబుతారు. జగన్ కూడా కేఎన్ఆర్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
జగన్ ముఖ్యమంత్రి అవ్వక ముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో బైఠాయించిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు గొడవ జరిగింది. కేఎన్ఆర్ గురించే అని చాలా మందికి తెలియదు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో జగన్ మీద దాడి జరిగిన సమయంలోనూ.. నాగేశ్వరరెడ్డి పక్కేనే ఉన్నారు. ఇటు వివిధ వర్గాలకు చెందిన వారితో సమావేశాల్ని ఏర్పాటు చేయించటంలో.. నాగేశ్వరెడ్డికి మంచి పట్టు ఉందని చెబుతారు. అందుకే చాలామంది నేతలు ముందుగా కేఎన్ఆర్‌తో మాట్లాడతారు. జగన్ వెళ్లలేని ఫంక్షన్లకు.. ఆయన తరఫున కేఎన్ఆర్‌ను పంపుతారనే టాక్ కూడా ఉంది. అందుకే కేఎన్ఆర్ అంటే.. జగన్‌కు ఎంతో ఇష్టం అని చెబుతారు.