తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజ కవర్గ బాధ్యుడు పుత్తా నరసింహారెడ్డి, యువ నాయకులు పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, లక్ష్మీరెడ్డి తదితర కలిశారు. అన్నమయ్య జిల్లా బి. కొత్తకోటలో లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో మంగళవారం వారు పాల్గొని సంఘీభావం తెలిపారు. నియోజకవర్గం, జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి పుత్తా నరసింహారెడ్డి లోకేశ్ కు వివరించారు. ఇప్పటి నుంచే అంతా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాలని లోకేశ్ చెప్పినట్లు నాయకులు తెలిపారు.