ఏపీలో ప్రతి నెలా ఒకటవ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తారనే విషయం తెలిసిందే. కాగా, ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీ రెండు రోజులు ఆలస్యం కానుంది. ఏప్రిల్ 1న ఆర్బీఐ సెలవు ప్రకటించడం, 2వ తేదీన ఆదివారం కావడంతో 3వ తేదీన పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పింఛన్ ఆలస్యం విషయాన్ని లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది.